

దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో భారీ ధర్నా జరగనుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసనలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు విద్యావ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు.
దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యావ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురావాలని కోరుతోంది. ఈ ధర్నాలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు సమాచారం. కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో పాటు ఇందిరా పార్క్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!