

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేజేఎస్ సంస్థ సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామాల్లో తన రెండో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా 1,500 మంది మహిళలకు ప్రత్యక్షంగా, వందలాది మంది స్థానిక యువతకు పరోక్షంగా ఉపాధి లభించనుంది. ప్రస్తుతం పటాన్చెరు మండలం పాశమైలారంలో సంస్థ తొలి యూనిట్ కొనసాగుతోంది.
ఈ పరిశ్రమలో ఆహార పదార్థాలు, పానీయాలు, కాఫీ, పోషకాహార ఉత్పత్తులు తయారు కానున్నాయి. దీంతో సంగారెడ్డి ప్రాంతం ఆహార, పానీయాల ప్రాసెసింగ్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రత్యేక కృషి చేశారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహంతో మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పరిశ్రమ స్థాపన వేగంగా పూర్తవుతోందని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!