
జనరల్

దేశంలో డ్రగ్స్ ముఠాలపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో నార్కోటిక్స్ నియంత్రణ బ్యూరో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయినట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల అధిక నాణ్యత కలిగిన కొకెయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న మొత్తంలో జరిగిన డ్రగ్స్ రవాణా ఆధారంగా దర్యాప్తు విస్తరించి, చివరకు అంతర్జాతీయ ముఠాను బయటపెట్టగలిగినట్లు తెలిపారు.
ఈ విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించిన అమిత్ షా, ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నార్కోటిక్స్ నియంత్రణ బ్యూరో బృందాన్ని అభినందించారు. దేశంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!