
ఓటీటీ

వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్లాస్టిక్ వస్తువులు పెద్దఎత్తున దగ్ధం కావడంతో భారీగా పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగ, ఘాటు వాసనతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, ప్రమాద స్థలానికి సమీపంలో మిర్చి కోల్డ్ స్టోరేజ్‌లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మంటలు మరింత విస్తరిస్తాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం తదితర అంశాలపై సమాచారం తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!