

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడలో మంత్రి నారాయణ బెలూన్లు ఎగురవేసి ఈ నాలుగు వారాల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చడం, డివైడర్లకు పెయింటింగ్ వేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత, రెండో వారంలో కాలువల క్లీనింగ్, మూడో వారంలో చెత్త వేరు చేసే అవగాహన, నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!