

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పరిధిలోని జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు దశలవారీగా తిరిగి రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్ బస్ భవన్‌లో ఏర్పాటు చేసిన నియంత్రణ, పర్యవేక్షణ కేంద్రంలో సాంకేతిక బృందం, జేబీఎం సాంకేతిక నిపుణులు, చైనా నుంచి వచ్చిన బ్యాటరీ నిపుణులు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈరోజు మరో 118 బస్సులకు వంద శాతం ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న జేబీఎం బస్సుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మొత్తం 500 జేబీఎం బస్సుల్లో ఇప్పటికే 150 బస్సులు సేవల్లోకి రాగా, తాజాగా మరో 118 బస్సులు రోడ్లపైకి వచ్చాయి. మరో రెండు నుంచి మూడు రోజుల్లో మిగిలిన బస్సులన్నీ పూర్తిస్థాయిలో సేవల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జేబీఎం బస్సులు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అదనపు బస్సు సర్వీసులు నిర్వహించాలని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్ని ప్రాంతీయ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!