

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మెల్‌బోర్న్‌లో విక్టోరియా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగన్ ఎంపీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు, భారత్–ఆస్ట్రేలియా మధ్య విద్యా సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలు మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
మెల్‌బోర్న్‌లో యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని, ఇందుకు అవసరమైన భూమి కేటాయింపులో ప్రభుత్వం సహకరించాలని మల్లారెడ్డి మంత్రి ఎన్వర్ ఎర్డోగన్‌ను కోరినట్లు తెలిపారు. తెలంగాణను సందర్శించాలని మంత్రిని ఆహ్వానించిన ఆయన, ఇరు ప్రాంతాల మధ్య విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత భాగస్వామ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!