
రాజకీయాలు

తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి భారీ సోదాలు నిర్వహించారు. ఇసుక, గ్రానైట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడులతో వ్యాపార, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
సుమారు నాలుగు ప్రముఖ కంపెనీల కార్యాలయాలు, వాటి అధినేతల నివాసాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టడం, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ రికార్డులు, హార్డ్ డిస్క్‌లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!