

విజయవాడలో యూనియన్ బ్యాంక్‌కు తప్పుడు సమాచారంతో సుమారు రూ.24 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యూనిట్లు ఏర్పాటు చేయకుండానే షెల్ కంపెనీలను ఉపయోగించి బ్యాంకు నుంచి పొందిన రుణ నిధులను మళ్లించినట్లు ఫిర్యాదు నమోదైంది. రుణానికి సంబంధించిన తనిఖీల్లో భారీగా అవకతవకలు బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో రూ.23.85 కోట్ల విలువైన సరుకు ఉండాల్సి ఉండగా, కేవలం రూ.25 లక్షల విలువైన నిల్వలు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంక్ ఏజీఎం శ్రీకాంత్ పాత్రో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు ఆధారంగా రుణం తీసుకున్న ఓంకార విజయలక్ష్మి స్ట్రయిప్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. షెల్ కంపెనీల ఏర్పాటు, రుణ నిధుల మళ్లింపు, బ్యాంకుకు సమర్పించిన తప్పుడు సమాచారం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!