
జనరల్

నేడు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభంలో దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించనున్నారు. అనంతరం చమురు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన న్యాయ వివాదాలపై కేంద్ర మంత్రి సురేష్ గోపీ ప్రకటన చేయనున్నారు.
ఈరోజు సభలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీకి సంబంధించిన కీలక తీర్మానాన్ని ఈటల రాజేందర్, అజయ్ భట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనను అర్జున్ రామ్ మేఘవాల్ సభ ముందుంచనున్నారు. ఈ అంశాలపై సభలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!