

గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిమజ్జనం ప్రారంభమయ్యే బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. నిజామాబాద్‌లో మంగళవారమే వైన్ షాపులు బంద్ కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. మద్యం మత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
గణేశ్ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25న మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఉంటుంది. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!