

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలగింపులో అమెరికా హస్తం ఉందని సూచించే రహస్య దౌత్య సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ మీడియా సంస్థ డ్రాప్ సైట్ ప్రచురించిన పత్రం ప్రకారం 2022 ఏప్రిల్‌లో పాకిస్థాన్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్, అమెరికా అధికారి డొనాల్డ్ లూ మధ్య జరిగిన భేటీలో ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని చర్చ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిణామాల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయి షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న తటస్థ వైఖరి అమెరికాకు అసంతృప్తి కలిగించిందని లీక్ సమాచారం చెబుతోంది. తొలగింపుకు ముందు ఆయన విదేశీ శక్తులు తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆరోపణలను అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఆయనకు శిక్ష పడగా, అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!