

వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అఖీరా నీట్ లో ర్యాంకు సాధించి, మెదక్ జిల్లా పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు. అయితే కళాశాలలో చేరేందుకు సుమారు రూ.2 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెకు అడ్మిషన్ విషయంలో సమస్య ఎదురైంది. ఈ విషయంపై ఈనాడు ‘డాక్టరు అవ్వాలని ఉంది’ అనే శీర్షికతో సెప్టెంబర్ 19న వరంగల్ జిల్లా పేజీలో కథనం ప్రచురించింది. ఈ కథనం ద్వారా అఖీరా పరిస్థితిని తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో అఖీరా కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అఖీరాకు రూ.2 లక్షల చెక్కును కేటీఆర్ అందజేశారు. వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటామని ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య వైద్య విద్యను కొనసాగించేందుకు కేటీఆర్ అందించిన సాయం అఖీరా కుటుంబానికి ఊరటనిచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!