

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్లో తొలి టికెట్‌ను స్వయంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి ప్రత్యేకత చాటుకున్నారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డికి ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మల్లన్నను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
కొత్త రైల్వే స్టేషన్లో రైలును కిషన్ రెడ్డి ప్రారంభించి తొలి ప్రయాణం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇతర నాయకులతో కలిసి గజ్వేల్ రైల్వే స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కొత్త రైల్వే స్టేషన్‌తో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!