

కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మునీరాబాద్‌లో గురువారం కీలక జల సమావేశం జరగనుంది. తుంగభద్ర ఆనకట్టకు పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాజోలిబండ మళ్లింపు పథకం, తుంగభద్ర ప్రాజెక్టు, కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించిన అంతర్రాష్ట్ర సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జలసౌధలో సమీక్ష నిర్వహించారు. రాజోలిబండ పథకం ఆధునీకరణ, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర హక్కులను కాపాడే అంశాలను కేంద్ర మంత్రి సమక్షంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!