

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో వివరాలు సరిగా నమోదు చేయలేదని, తప్పులు లేదా లోపాలతో సమాచారం సమర్పించారంటూ నోటీసులు అందుకున్న 44,24,411 మంది ఓటర్ల విచారణను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. వీరిలో 1,66,279 మందిని అనర్హులుగా గుర్తించగా, 42,01,092 మందిని తుది ఓటర్ల జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది. మరో 57,040 మంది విచారణ పూర్తయినప్పటికీ వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. 4,434 మంది విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.
జులై 31న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,71,38,182 మంది ఓటర్ల వివరాలను ప్రచురించారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో వివరాలు సరిగా లేవన్న కారణంతో 44,28,845 మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలిన 3,27,09,337 మంది ఓటర్లలో 3,27,08,479 మందిని అర్హులుగా గుర్తించగా, 858 మంది విచారణ పెండింగ్‌లో ఉంది. ఫాం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు వచ్చిన 85,736 దరఖాస్తులు, ఫాం-8 ద్వారా మార్పులు, చేర్పులకు వచ్చిన 40,991 దరఖాస్తులు, ఫాం-7 ద్వారా అనర్హుల ఓట్లు తొలగించాలంటూ వచ్చిన 9,296 దరఖాస్తుల విచారణ కూడా కొనసాగుతోంది. పెండింగ్ ప్రక్రియను అక్టోబర్ 5లోగా పూర్తి చేసి, అక్టోబర్ 9న తుది జాబితాను ప్రచురించనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!