
జనరల్

ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజా ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ నాలుగు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.
జస్టిస్ స్వర్ణకాంత శర్మపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉన్న ఆమెపై పాత వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించి, కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!