
జనరల్

హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌లో భాగంగా బుల్లెట్ రైలు అమరావతి మీదుగానే వెళ్లనుంది. రాజధాని ప్రాంతంలోనే తొలి స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తుది లొకేషన్ సర్వే మరియు డీపీఆర్ తయారీకి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది.
గతంలో రావెల సమీపంలోని ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని కారిడార్ అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. అయితే అలా చేస్తే అమరావతి, విజయవాడకు దూరం అవుతుందని గుర్తించారు. దీంతో రాజధాని నగరానికే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవుతో ఈ కారిడార్ అభివృద్ధి కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!