
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టి హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్‌లోని మజ్దల్ గ్రామంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
రాజకీయంగా కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హమాస్ నిరాయుధీకరణ, గాజా నుంచి బలగాల ఉపసంహరణపై ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తిరస్కరించారు. ఈ నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై ఒమన్‌తో ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!