
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని డాక్టర్ శైలా తాళ్లూరి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, నిజాయితీగా విచారణ జరిపి సంబంధిత మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
డాక్టర్ శైలా తాళ్లూరి చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమె ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వెల్లడించలేదు. ఈ విషయంపై ఇప్పటివరకు సంబంధిత మంత్రి లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!