
సినిమాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న సీఎం. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, మార్గనిర్దేశం చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వివక్షను ఆధారాలతో వివరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బలమైన పునాది వేశారని సీఎం అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!