
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రి సి. ఆర్. పాటిల్‌తో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, నదీ సంరక్షణ అంశాలపై విస్తృత చర్చలు జరిపింది. గోదావరి నది పవిత్రతను కాపాడటం, మురుగునీటి నిర్వహణ, కాలుష్య నియంత్రణ, భారీ భక్తుల రాకను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
పర్యావరణ అనుకూలంగా పుష్కరాలను నిర్వహించే ఏపీ ప్రణాళికను కేంద్ర మంత్రి ప్రశంసించారు. నమామి గంగే వంటి విజయవంతమైన ప్రాజెక్టుల మాదిరిగా ఉత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. సూరత్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఏపీ సమగ్ర ప్రతిపాదనను కేబినెట్ పరిశీలనకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!