
టెక్నాలజీ

కేదార్‌నాథ్‌లో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది. తొలిసారిగా ఆలయంలో ఏకబిగిన 22 గంటలపాటు దర్శనాలు కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 30 వేల మంది భక్తులు చేరుకుంటుండటంతో దర్శనానికి దాదాపు 11 గంటల సమయం పడుతోంది. దీంతో కేదార్‌నాథ్ ప్రాంతంలో భారీ రద్దీ పరిస్థితి నెలకొంది.
భక్తుల రాక పెరుగడంతో రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. కేదార్‌నాథ్ వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. పరిస్థితిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!