
క్రీడలు

ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్రం శుభవార్త తెలిపింది. 2026 డిసెంబర్ 31 వరకు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని కొత్తగా లింక్ చేయడం లేదా అప్‌డేట్ చేసుకోవడం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ సేవకు రూ.75 రుసుము వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఆ ఛార్జీని మినహాయించారు. దీంతో ఆధార్‌కు ప్రస్తుత జీమెయిల్ ఐడీని జోడించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఈ ప్రక్రియను అధికారిక ఆధార్ యాప్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. 12 అంకెల ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అయి ఈమెయిల్ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం కొత్త జీమెయిల్ ఐడీని నమోదు చేసి వివరాలను ధృవీకరించి అభ్యర్థనను సమర్పించాలి. సుమారు 15 రోజుల్లో ఈమెయిల్ అప్‌డేట్ పూర్తవుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!