
రాజకీయాలు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల క్రితం మిడ్జిల్ జడ్పీటీసీగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం తనను అప్పట్లో గెలిపించిన అనుచరులు, స్థానిక నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పాత మిత్రులతో కలిసి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారిని సీఎం ఆత్మీయంగా కలుసుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!