
క్రీడలు

రేపటి నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కొమురంభీం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 12 న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వైద్యశాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!