
సినిమాలు

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించగా, జులై 20 నుంచి అది అమల్లోకి రానుంది. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐఆర్‌సీటీసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
తన పదవీకాలంలో ఐఆర్‌సీటీసీ మినీరత్న నుంచి నవరత్న హోదాకు ఎదిగిందని, అలాగే షెడ్యూల్-బి నుంచి షెడ్యూల్-ఏ జాబితాకు చేరిందని సంజయ్ కుమార్ జైన్ తన రాజీనామా లేఖలో తెలిపారు. ఈ ప్రయాణంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఐఆర్‌సీటీసీ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన 2024 ఫిబ్రవరి 14న ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!