

బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు యువకుడికి ఉత్సాహం రావడం సహజమేనని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన గోపాల్ (19) 2018 మే 10న ఓ యువతితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. యువతి తీవ్రంగా గాయపడింది. గోపాల్ మృతికి పరిహారం కోరుతూ అతడి తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులో తేని కోర్టు రూ.25 లక్షలు చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా సంస్థ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ సుమతి ధర్మాసనం కేసును విచారించింది. ప్రమాదంలో బైక్ నడిపిన గోపాల్ నిర్లక్ష్యం కూడా ఉందని భావించిన ధర్మాసనం, పరిహారాన్ని 25 శాతం తగ్గించాలని ఆదేశించింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని, 19 ఏళ్ల యువకుడు బైక్ వెనుక తన ప్రియురాలిని కూర్చోబెట్టుకుని వెళుతున్న సమయంలో ఉత్సాహంగా ఉండటం సహజమని వ్యాఖ్యానించింది. వ్యాన్ సరైన మార్గంలో వెళుతుండటంతో ప్రమాదానికి గోపాల్ నిర్లక్ష్యం కూడా కొంత కారణమైందని కోర్టు అభిప్రాయపడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!