
జనరల్

దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన ఇందౌర్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. యాచకుల్లేని తొలి నగరంగా నిలిచి దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారింది. యాచకత్వాన్ని నిర్మూలించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గౌరవప్రదమైన జీవితం అందించేందుకు నగర పాలక సంస్థ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది.
రెండేళ్ల క్రితం రోడ్లు, కూడళ్లలో భిక్షాటనను నిషేధించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రత్యేక బృందాలు యాచకులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. అక్కడ వారికి వైద్య సేవలు, కుటుంబ గుర్తింపు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఆధార్ వంటి పత్రాలు సిద్ధం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!