
జనరల్

ఇండోనేషియాలో స్థానిక యువత, కమ్యూనిటీలు ప్లాస్టిక్ వ్యర్థాలను వినూత్నంగా ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. సాధారణంగా ఉపయోగించిన తర్వాత పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను సేకరించి వాటితో ఫ్లోటింగ్ వెజిటబుల్ బెడ్స్ తయారు చేస్తున్నారు.
వెదురు కట్టెలతో ప్లాస్టిక్ బాటిళ్లను కట్టి నీటిపై తేలియాడే ప్లాట్‌ఫాంలుగా మార్చి వాటిపై మట్టి, తేలికపాటి గ్రోయింగ్ మెటీరియల్ వేసి కూరగాయలు పండిస్తున్నారు. ఇండోనేషియాలో తరచుగా వచ్చే వరదల సమయంలో ఈ బెడ్స్ నీటి మట్టంతో పాటు పైకి తేలిపోవడంతో పంటలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇలా పండిన కూరగాయలను స్థానిక అవసరాలకు వినియోగించడమే కాకుండా మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇండోనేషియా యువత సృజనాత్మకతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!