
క్రీడలు

భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. రెడ్ బెలూన్ ఏరో స్పేస్ అభివృద్ధి చేసిన ఈ బెలూన్ పాలిమర్ నానోకాంపోజిట్‌తో తయారై హైడ్రోజన్‌తో నింపబడింది. ఇందులో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మాడ్యూల్ అమర్చగా, 50 కిలోల వరకు పేలోడ్ మోయగల సామర్థ్యం ఉంది.
ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌కు మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంపునకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత స్పేస్ పరిశ్రమ 8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, రాబోయే పదేళ్లలో ఇది 40 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. స్ట్రాటోస్ఫియర్‌లో దీర్ఘకాలం పనిచేసే ఈ బెలూన్లు పరిశోధనలు, కమ్యూనికేషన్, పరిశ్రమల పర్యవేక్షణకు ఉపయోగపడతాయని వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!