
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని మెదక్ ఎంపీ, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో సన్స్‌ద్ వంటి కార్యక్రమాలు దేశంలో క్రీడా విప్లవానికి దారితీశాయని, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని ఆయన తెలిపారు. 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ చాంపియన్‌షిప్‌ను భారత్ నిర్వహించడం గర్వకారణమని అన్నారు. అనంతరం విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!