
సినిమాలు

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పెంచాలని, సీఎంఆర్ గడువులను పొడిగించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసింది.
దేశంలోనే అత్యధికంగా 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని తెలంగాణ సేకరించింది. 2025-26 మార్కెటింగ్ సీజన్లో 152 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి సేకరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లక్ష్యాన్ని 54.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని రాష్ట్రం కోరింది. అలాగే సీఎంఆర్ గడువులను 60 రోజులు, 120 రోజులు పొడిగించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!