

నటుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పునస్సమీక్షించాలని సూచించింది. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఈ నెల 20న ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ మెమో చట్టంతోపాటు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంటూ, మెమోను పునస్సమీక్షించి ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని సూచించారు. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా, ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని నాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోలీసు అధికారులను కోరారు. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తామని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!