7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 10:20 PM, 7 నవంబర్, 2026
కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌ను విద్యా, పారిశ్రామిక రంగాల్లో కీలక కేంద్రంగా అభివృద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన పరిశ్రమల ఉత్పత్తుల స్టాళ్లను ఆయన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ తదితరులతో కలిసి సందర్శించారు. ఏరోస్పేస్, రక్షణ, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, వస్త్ర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించాయి. అనంతరం ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడిన సీఎం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాంతంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని విమర్శిస్తూ, ఎల్‌నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై డిసెంబర్‌లో అసెంబ్లీలో రెండు రోజుల చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. భూసేకరణలో రైతులకు మెరుగైన పరిహారం అందిస్తున్నామని చెప్పారు. రూ.10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. RARE ఎడ్యుకేషన్ హబ్, RARE ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు తాండూరు కందులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొడంగల్‌లో పరిశ్రమలు, విద్యాసంస్థల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలను కలుస్తానని, ఎల్‌నినో ముప్పును అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికొడంగల్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోతెలంగాణ ప్రభుత్వంకొడంగల్ అభివృద్ధిగ్రామీణాభివృద్ధిRARE ఎడ్యుకేషన్ హబ్RARE ఇండస్ట్రియల్ పార్క్కాళేశ్వరం ప్రాజెక్టుఎల్‌నినోరైతు సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!
బిజినెస్

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!
జనరల్

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..
సినిమాలు

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!
సినిమాలు

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..
బిజినెస్

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!