

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని పశువధశాలలు, మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తార్నాకకు చెందిన వి. శ్రీకాంత్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ జరిపారు.
నిషేధ ఉత్తర్వులు జారీ చేసే ముందు జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా తాజా ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపిస్తూ, కమిషనర్‌పై రూ.50 వేల జరిమానా విధించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!