
జనరల్

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయంకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు రెండు విడతలుగా దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!