
క్రీడలు

తీవ్ర వాయుగుండం తీరం దాటిన అనంతరం ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణలో నిన్నటితో పోలిస్తే వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!