

ఆంధ్రప్రదేశ్‌లో భద్రతా సాంకేతికతను ప్రోత్సహించేందుకు సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. సీఐఐ సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వేదిక ద్వారా డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, ఇతర ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించేందుకు స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో మూడు నుంచి ఏడు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఏఐ4ఏపీ కార్యక్రమంతో పాటు 15 వేల కెమెరాలతో కూడిన సీసీటీవీ 360 వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో భాగం చేయడం ద్వారా నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. మహిళల భద్రతకు సంబంధించి విశాఖపట్నం అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా నిలుస్తోందని అనిత పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!