
జనరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాబోయే మూడు గంటల పాటు పలు జిల్లాలకు పిడుగులు, ఈదురుగాలులు మరియు వర్షాలకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించి తేలికపాటి వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!