
రాజకీయాలు

తెలంగాణలో అర్ధరాత్రి సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా కొత్తమొల్గరలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పర్పల్లి, భూత్పూర్‌లో 10 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ టౌన్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేటలోని అంగడ కిష్టాపూర్‌లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ డిండిలో 6.2 సెంటీమీటర్లు, సంగారెడ్డిలో హత్నూరలో 6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!