
సినిమాలు

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కొనసాగుతున్న నిరసనల సమయంలో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఆందోళనకారులు దాడికి పాల్పడినట్లు సమాచారం. పలు వాహనాల విండ్‌స్క్రీన్‌లను పగలగొట్టి, వాటిపై గ్రాఫిటీ రాసిన అనంతరం నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల్లో దెబ్బతిన్న వేమో కార్ల మొత్తం విలువ సుమారు 6 లక్షల డాలర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనల నేపథ్యంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో భద్రతా కారణాలతో లాస్ ఏంజిల్స్‌లో తన సేవలను నిలిపివేసింది. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు లాస్ ఏంజిల్స్ పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. నిరసనలు, అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో స్వయంచాలక వాహనాల భద్రతపై ఈ ఘటనలు మరోసారి చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!