
క్రీడలు

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోగా, భక్తులు శ్రీవారి సేవా సదన్ భవనం వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం దాదాపు 24 గంటల సమయం పడుతోందని తితిదే అధికారులు తెలిపారు.
తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, భక్తుల రద్దీ దృష్ట్యా టైమ్ మేనేజ్మెంట్ మరియు క్యూ లైన్ పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 79,603 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. తితిదే, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!