

స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఫిలింనగర్‌లోని ఆయన విగ్రహానికి ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ భరత్ భూషణ్, నందమూరి మోహనకృష్ణ, నందమూరి సీమంతిని, పరుచూరి గోపాలకృష్ణ, బాబు మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడని పలువురు కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల కోసం పనిచేసిన మహానేత అని, పేదల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 1000 మందికి పైగా ప్రజలకు అన్నదానం నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!