
క్రీడలు

ఒడిశాలో వైరల్ అయిన ఘటనపై గ్రామీణ బ్యాంక్ స్పందిస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేసింది. బ్యాంక్ అధికారుల ప్రకారం, జీతు మొండా మద్యం మత్తులో వచ్చి తన సోదరి ఖాతాలోని డబ్బుల కోసం హల్‌చల్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనను తప్పుగా చూపిస్తూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
ఖాతాదారుడు లేకుండా లేదా సరైన పత్రాలు లేకుండా నగదు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. డెత్ సర్టిఫికెట్ సమర్పించిన తరువాత మాత్రమే డబ్బులు ఇవ్వగలమని చెప్పారు. అధికారుల నిరాకరణతో ఆ వ్యక్తి తన సోదరి మృతదేహాన్ని వెలికితీసి బ్యాంకుకు తీసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!