
క్రీడలు

తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు హాజరయ్యారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు.
ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ భావోద్వేగంగా సినిమా శైలిలో చెప్పడం ప్రారంభించడంతో గవర్నర్ మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన అధికారిక ప్రక్రియ అని సాధారణంగా ప్రమాణం చేయాలని సూచించారు. దీంతో విజయ్ వెంటనే సర్దుకుని సాధారణ విధానంలో ప్రమాణం పూర్తి చేశారు.
విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. టీవీకే పార్టీ సీనియర్ నేతలు ఆధవ్ అర్జునా, కె.ఎ. సెంగోట్టియన్ మంత్రివర్గంలో చోటు పొందారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!