
ఓటీటీ

కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. ఈ ఘటనపై వచ్చిన మీడియా కథనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
ఉపాధి కోసం ఫిబ్రవరిలో కువైట్ వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తుండగా, ఏజెంట్ల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆమెపై వేధింపులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ ఆమెను త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!