
జనరల్

హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు భారీ మోసం కేసులో అరెస్ట్ చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సన్నిహితుడినని చెప్పుకొని ప్రజల నమ్మకాన్ని పొందుతూ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తన శరీరమంతా బంగారం ధరించి తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నాడు. నెలలు గడిచినా బంగారం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన బాధితులను బెదిరించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!