
జనరల్

నరేంద్ర మోదీ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని సభకు ముందు వేదికకు సమీపంలోని కగలిపుర ప్రాంతంలో రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యమవడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. సభా వేదికకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో గుర్తించిన ఈ పేలుడు పదార్థాలను బాంబు నిర్వీర్వ దళాలు సురక్షితంగా తొలగించాయి.
ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ రాకముందు నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్ స్టిక్స్ బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు చేపట్టడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!