

సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి నిబంధనలను సరళతరం చేశామని ప్రభుత్వం, అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ రైతులు మాత్రం ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ భూ రికార్డుల్లో అమ్మకందారు పేరు లేకపోవడం కొత్త సమస్యగా మారింది.
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు తెల్ల కాగితంపై రాసుకున్న ఒప్పందంతో కొనుగోలు చేసిన రెండెకరాల భూమికి దరఖాస్తు చేసుకోగా, అమ్మకందారు పేరు ఆన్లైన్లో లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. మరోవైపు వరంగల్ జిల్లాలో ఓ రైతు దరఖాస్తును, భూమి విక్రయించిన రైతు కుమారుల పేర్లు నమోదై ఉండటంతో అంగీకరించలేదు. దీంతో సాదాబైనామా దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మార్గదర్శకాలు వచ్చినా సమస్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని రైతులు వాపోతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!